
శ్రీమద్భాగవతం అష్టాదశ మహాపురాణాలలో అవిరళ ప్రచారానికి నోచుకొన్న వాసుదేవ కథాకలశ
రత్నాకరం. వేదాంత ధర్మాన్ని విదగ్ధ కవితా శిల్పంతో మేళవించి శ్రీకృష్ణ వైభవ ప్రకాశన
కావించిన పుణ్య కథాకోశం. శ్రీ శతఘంటం వేంకటరంగ శాస్త్రిగారు వ్యాస భాగవతాన్ని తెలుగులో
వచనరూపంలో అనువదించగా, దానిని శ్రీ దొడ్ల వేంకట రామిరెడ్డిగారు యథోచితమైన మార్పులతో,
పోతనగారి పద్యాలను ఉదహరిస్తూ సరికొత్త పాఠాన్ని వ్రాసారు. ఈ గ్రంథాన్ని శ్రీ విష్ణుపురాణకర్తలు,
పండితాగ్రేసరులు అయిన శ్రీ ఏల్చూరి మురళీధరరావుగారు ఆధునిక పాఠకులకు ఉపయుజ్యమైన
ధోరణిలో సులభశైలిలో, వచనంలో రచించారు.