
Sri Ramakrishna Charitamrutam (Telugu) (Deluxe)
Non-returnable
₹ 150.00
Tags:
శ్రీరామకృష్ణ చరితామృతం ( శ్రీరామకృష్ణుల జన్మ వృత్తాంతం – ఒక పద్యకావ్యం )
ఈ పుస్తకం చదువుతున్నప్పుడు నాకు కలిగిన ఆనందం మాటల్లో వర్ణించలేను. ఈ పుస్తకంలో ఒక్క పదం కూడా అనవసరంగా లేద’ని స్వామి వివేకానందునిచే ప్రశంసించబడిన గ్రంథరాజం ఇది. బెంగాలీ మూలానికి ఏ మాత్రం వాసి తగ్గకుండా తెలుగులోనికి యథాతథంగా అనువదించడం జరిగింది. ఇందు శ్రీరామకృష్ణులవారి జీవితం ఐదు ఖండాలలో అభివర్ణించడం జరిగింది. వారి జననం, బాల్యం, కోల్కత్తా ఆగమనం, పూజారిగా విధులు నిర్వర్తించడం, వివిధ ఆధ్యాత్మిక సాధనలతో వారు గడిపిన తపోమయ జీవితం, ఆధ్యాత్మిక గురువుగా ఆయన చేసిన అనేక దృష్టాంతాలతో కూడిన బోధలు, స్వామి వివేకానందుని తీర్చిదిద్దిన తీరు, అనారోగ్యకారణంగా వారిని కోల్కత్తాకి తీసుకురావడం, దేహ బాధలు ఆత్మను అంటవని వారు ప్రకటించిన నిబ్బరం మొదలైన అనేక విశేషాంశాలతో ఈ పుస్తకం రూపుదిద్దుకుంది. శ్రీరామకృష్ణుల చరణాల వద్ద తమను తాము సమర్పించుకుని వారిపై భక్తిని పెంపొందించుకోవాలనే తపన ఉన్న భక్తులకు ఈ గ్రంథం సుమధుర రసభరితంగా, హృదయంగమంగా నిలుస్తుందని మా భావన.