
Bharatiya Pratibha Visheshalu 108 Nijalu భారతీయ ప్రతిభా విశేషాలు
భారతీయ ప్రతిభా విశేషాలు: 108 నిజాలు ( విభ్రాంతిగొలిపే ప్రాచీన, సమకాలీన ఋజువులతో
భారతదేశ సాంస్కృతిక, వైజ్ఞానిక వైభవం )
భారతీయులు ఏ రంగంలోనూ తీసిపోరు. నవీన నాగరికులకు భారతీయ సంస్కృతి, చరిత్ర,
మేధాసంపత్తిని తెలియజేస్తూ, భారతీయుల ప్రతిభా విశేషాలను గతమనే దర్పణంలో చూపించే
ప్రయత్నమే ఈ పుస్తకం. మన ప్రాచీన విజ్ఞాన వైభవాన్ని గుర్తిస్తూ మనలోని ఆత్మవిశ్వాసాన్ని
ప్రకటించినప్పుడే భారతజాతి పురోగమిస్తుందనే స్వామి వివేకానందుని వాక్కులను ఈ సందర్భంగా
స్మరించడం ఎంతైనా అవసరం. ప్రతి ఇంటా తప్పక ఉండవలసిన విజ్ఞాన వీచిక ఈ 108 నిజాలు.