
Sri Dakshinamoorty Stotram (Telugu) (Paperback)
శ్రీ దక్షిణామూర్తి స్తోత్రమ్
మౌనస్వరూపంగా భాసిల్లే పరమశివుని తత్త్వమే దక్షిణామూర్తిగా పేర్కొనబడింది. అద్వైతానుభూతిలో సచ్చిదానందస్థితిలో ఉన్న గురుని సాంగత్యమాత్రం చేతనే శిష్యుల సంశయాలు పటాపంచలు కాగలవు. దానికి నిదర్శనమే దక్షిణామూర్తి స్వరూపం. దానిని విశదపరుస్తూ మహోన్నత అద్వైత సారాంశాన్ని పది మృదు మధుర శ్లోకాలలో పొందుపరచి లోకానికి అందించిన కారుణ్యమూర్తులు శ్రీశంకరులు. ఈ పుస్తకంలో శ్లోకాలకు పదాన్వయంతోపాటు భావాలను కూడా అందించడం జరిగినందున ఇది భక్తులకే కాక జిజ్ఞాసువులకు కూడా ఉపయుక్తంగా ఉంటుంది.