
Sri Ramakrishna Kathamrutam (Sangraham) (Telugu) (Paperback)
శ్రీ రామకృష్ణ కథామృత సంగ్రహం
ప్రపంచంలో మొట్టమొదటిసారి ఒక అవతారపురుషుని మాటలు యథాతథంగా పదిలపరచబడిన గ్రంథం శ్రీరామకృష్ణ కథామృతం. గ్రామ్యభాషలో చిరుపల్కులలో వేదాంత సారాన్ని వివరించిన గ్రంథం. శ్రీరామకృష్ణులు భక్తులతో మాట్లాడుతున్నప్పుడు వారి నోట ఆధ్యాత్మిక సూక్ష్మ విషయాలు జాలువారేవి. వాటిని ఒక భక్తుడు గ్రంథస్థం చేశాడు. రెండు భాగాలలో వెలువడిన శ్రీరామకృష్ణ కథామృతాన్ని చదువలేనివారికి సంగ్రహంగా వెలువరించబడ్డ గ్రంథం ఇది. ప్రయాణీకులు వారితోపాటు తీసుకుపోవానికి అనువుగా పుస్తకం బరువు లేకుండా జాగ్రత్తలు తీసుకోబడ్డాయి.