
Sri Sankara Vijayam (Telugu) (Paperback)
శ్రీ శంకర విజయము
జగత్ప్రసిద్ధమైన అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం ద్వారా శ్రీ శంకర భగవత్పాదులు అధ్యాత్మిక చరిత్రలో శాశ్వత కీర్తిని సముపార్జించారు. వారు రూపొందించి, క్రమబద్ధీకరించి, ప్రవచించిన సిద్ధాంతాలన్నీ దేశ కాలాతీతంగా నిలిచాయి. శ్రీ శంకరాచార్యుల జీవిత విశేషాలు శ్రీపాదులవారి రచనలు చదివిన వారికి, చదవనివారికి కూడా చక్కటి స్ఫూర్తిని ఇస్తాయనడంలో సందేహంలేదు. సుమారు 500 సంవత్సరాలకు పూర్వం తుంగభద్రా నదీ తీరాన నివసించిన శ్రీ విద్యారణ్య స్వాములవారు శ్రీ శంకరుల జీవిత చరిత్రను “శంకర విజయము” అనే గ్రంథంగా రచించారు. ఈ ‘శంకర విజయం’ గ్రంథం మహాకావ్య లక్షణాలు కలిగినదని, యదార్థ విషయాలను చాలా చక్కగా ప్రతిపాదించడం జరిగినదని పండితుల అభిప్రాయం.
Delivery