
Viveka Suryodayam (Telugu) (Paperback)
వివేకసూర్యోదయం ( వ్యక్తిత్వ నిర్మాణానికి స్వామి వివేకానంద చేసిన దివ్యోత్సాహపూరిత ప్రబోధాలు )
భారతజాతి ఆశాకిరణాలైన యువతలో వికాసాన్ని కలిగించే విధంగా స్వామి వివేకానంద చేసిన ప్రబోధాలు తేటతెలుగు నుడికారంలో సూటిగా మనస్సులో నాటుకునే విధంగా వివరించబడ్డాయి. వివేకానందుని భావాలైన శ్రద్ధ, సేవ, ప్రేమ, విద్య, త్యాగం వంటి విషయాలు చక్కగా ఒకచోట చేర్చి అందమైన పూలమాలలాగా రూపొందించబడ్డాయి. శారీరక, మానసిక బలసముపార్జనం, ఆత్మవిశ్వాసం, దేశ దారిద్య్రనివారణం వంటి విషయాలపై వివేకానందుని దివ్యోత్సాహపూరిత భావాలు నేటి యువతకు ఆదర్శప్రాయంగా నిలుస్తాయి. ఈ వివేక సూర్యోదయం యువతను ధీరులుగానూ, కార్యశూరులుగానూ, వివేక మహితులుగానూ చేస్తుందనడంలో సంశయం లేదు.