Yogavashista Kathalu (Telugu)
జ్ఞానయుక్త వైరాగ్యముచే కర్మవైముఖ్యం పొందిన శ్రీరామునికి ‘జ్ఞానకర్మలు వేరుకాదని, అవి ఒకే పక్షి యొక్క
రెండు రెక్కల వంటివ‘ని ప్రబోధించి తిరిగి కర్తవ్యోన్ముఖుణ్ణి చేయడానికి వసిష్ఠ మహర్షి చేసిన ప్రయత్నమే
32 వేల శ్లోకాలతో యోగవాసిష్ఠ గ్రంథంగా పరిణమించింది. ఇది మన ఆధ్యాత్మిక ఘన వారసత్వాన్ని తేటతెల్లం
చేస్తుంది.
వసిష్ఠ మహర్షి వివరించిన కథలు, దృష్టాంతాలు, యథార్థ సంఘటనలు, పురాణేతిహాసాల ప్రస్తావనలు,
ప్రత్యక్ష దర్శనాలు, గతస్మృతుల నెమరువేత – వెరసి ఇదంతా శ్రీరామునికి కర్తవ్యం ప్రబోధించడానికే;
శ్రీరాముని ద్వారా మహాజ్ఞానమైన అద్వైత వేదాంతాన్ని సామాన్య సాధకుడు కూడా అవలీలగా అర్థం చేసుకునే
రీతిలో విషయాన్ని విశదీకరిస్తుంది ఈ గ్రంథరాజం.
అందుకే ఆసక్తిదాయకమైన; సందేశం –కథాగమనం కలసి సాగేలా ఉన్న కొన్ని కథలను మాత్రమే ఎన్నుకొని
ఈ పుస్తకం తీర్చిదిద్దాం.
Delivery